నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: ఆయుష్మాన్

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: ఆయుష్మాన్

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలో 'మీటూ' అనే ఉద్యమం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఎంతో ధైర్యంగా...

TV9 Telugu Digital Desk

| Edited By:

May 04, 2020 | 8:54 PM

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలో ‘మీటూ’ అనే ఉద్యమం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి మరీ వారు ఎదుర్కొన్న చేధు అనుభవాలను బయట పెట్టారు. అయితే ఇప్పుడు తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానంటూ.. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యలు చేయడం ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసింది.

తాను చిత్ర పరిశ్రమలో కొత్తగా అడుగు పెడుతున్న తరుణంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని తెలిపాడు. ‘ఓ ఇంటర్వ్యూలో ఖురానా తనకు ఎదురైన చేధు అనుభవాలను గురించి తెలిపారు. ‘ఓ దర్శకుడు సినిమాల ఛాన్స్ ఇస్తానని చెప్పి ఆడిషన్‌కి పిలిచాడు. సినిమా అవకాశం కదా అని పరుగున వెళ్లాను. కానీ అక్కడికి వెళ్లాక ఆయన నువ్వు నీ ప్రైవేట్ భాగాలను చూపిస్తే.. నీకు సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తానని చెప్పాడు’. అంతే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో ఇలానే అవకాశాలు పోగొట్టుకున్నట్లు ఆయుష్మాన్ పేర్కొన్నాడు.

అలానే ఓ సారి 50 మందిని సోలో టెస్ట్ తీసుకుంటామని చెప్పి లోపలికి పిలిచారు. దీనిని నేను వ్యతిరేకిస్తే.. నన్ను వెళ్లిపోమ్మని చెప్పేవారు. అయితే ప్రారంభంలో తాను ఎదుర్కొన్న వైఫల్యాలతో తనలో ఆత్మస్థైర్యం రెట్టింపు అయ్యిందని చెప్పాడు. కాగా ఆయుష్మాన్ 2012లో ‘విక్కీ డోనర్’ అనే సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ఆ తర్వాత విభిన్న పాత్రలు చేస్తూ.. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu