ఇకపై పట్టణాల్లో నిలిచిపోనున్న గృహ నిర్మాణాలు.. ఎందుకో తెలుసా?
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అవినీతిపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా పట్టణ ప్రాంత గృహ నిర్మాణంలో కూడా రివర్స్‌కు వెళ్లాలని నిర్ణయించింది. ఏ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేసే దిశగా సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో వివిధ నిర్మాణాలకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో వివిధ […]
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అవినీతిపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా పట్టణ ప్రాంత గృహ నిర్మాణంలో కూడా రివర్స్‌కు వెళ్లాలని నిర్ణయించింది. ఏ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేసే దిశగా సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో వివిధ నిర్మాణాలకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో వివిధ దశల్లో ప్రస్తుతం గృహనిర్మాణపనులు జరగుతున్నాయి. వీటి కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు టెండర్లు ఖరారు చేస్తూ, ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా వ్యవహరించిన తీరుకు ఫుల్ స్టాప్ పెట్టే చర్యల్లో భాగంగా అప్పటికే ప్రారంభం కాని పనులను రద్దు చేయడం, కొనసాగుతున్న పనులను పునః సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ్ రెడ్డి గారు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో టిడ్కో ఆధ్వర్వంలోని వివిధ గృహ నిర్మాణ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల పనుల పురోగతి, స్థితిగతులు సమీక్షించిన అనంతరం, ఈ పనులకు కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలన్న ఉత్తర్వులపై మంత్రి బొత్స సత్యనారాయయణ సంతకం చేశారు. ఈ నిర్ణయంతో ప్రాజెక్టుల వ్యయం తగ్గి ఖజానాపై భారం తగ్గడంతో పాటు, ఆయా పథకాల్లోని లబ్ధిదారులపై ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా టిడ్కో రివర్స్ టెండర్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది.