అద్భుత ఫీచర్లతో ‘రియల్ మీ’ నుంచి ఖరీదైన ఫోన్… ధర ఎంతంటే?

రియల్ మీ ఈసారి తమ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి కాస్త ఖరీదైన ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే రియల్ మీ తన ఖరీదైన ఫోన్ల జాబితాలోకి మరో ఫోన్ ను తీసుకువచ్చింది. అడ్వాన్స్ డ్ ఫీచర్లతో కూడిన రియల్ మీ ఎక్స్2 ప్రోను చైనా మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. వివరాల్లోకెళితే… రియల్ మీ ఎక్స్2 ప్రోలో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్, 64 జీబీ […]

అద్భుత ఫీచర్లతో  'రియల్ మీ' నుంచి ఖరీదైన ఫోన్... ధర ఎంతంటే?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 16, 2019 | 7:04 PM

రియల్ మీ ఈసారి తమ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి కాస్త ఖరీదైన ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే రియల్ మీ తన ఖరీదైన ఫోన్ల జాబితాలోకి మరో ఫోన్ ను తీసుకువచ్చింది. అడ్వాన్స్ డ్ ఫీచర్లతో కూడిన రియల్ మీ ఎక్స్2 ప్రోను చైనా మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. వివరాల్లోకెళితే…

రియల్ మీ ఎక్స్2 ప్రోలో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,699 యువాన్లుగా(సుమారు రూ.27,200) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,899 యువాన్లుగానూ(సుమారు రూ.29,200), హై ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధరను 3,299 యువాన్లుగానూ(సుమారు రూ.33,200) నిర్ణయించారు.

ఈ మూడు వేరియంట్లూ వైట్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్ సేల్ చైనాలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. రియల్ మీ ఎక్స్2 ప్రోతో పాటు రియల్ మీ ఎక్స్2 ప్రో మాస్టర్ ఎడిషన్ ను కూడా రియల్ మీ ఈ కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఒక్క స్టోరేజ్ తప్ప మిగతా స్పెసిఫికేషన్లన్నీ రియల్ మీ ఎక్స్2 ప్రో మాదిరిగానే ఉంటాయి. దీని ధర 3,299 యువాన్లుగా(రూ.33,200) ఉంది. ఈ ఫోన్ ను భారత మార్కెట్లో డిసెంబర్ లో లాంచ్ చేయనున్నట్లు రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేఠ్ తెలిపారు.

ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా, స్క్రీన్ రిఫ్రెష్ 90 హెర్ట్జ్ గా ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ 135 హెర్ట్జ్. ఇందులో స్క్రీన్ టు బాడీ రేషియో 91.7 శాతంగా ఉంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగించారు.

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సామర్థ్యం గల శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్ ను ఉపయోగించారు. అంతే కాకుండా 13 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న టెలిఫొటో లెన్స్, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న డెప్త్ సెన్సార్ ను కూడా అందించారు. ఇక 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్ ను ఇందులో సెల్ఫీ కెమెరాగా అందించారు.

ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత కలర్ ఓఎస్6.1పై ఈ ఫోన్ పనిచేయనుంది. అంతేకాకుండా ఇందులో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. ఇది 50W SuperVOOC ఫ్లాష్ చార్జ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా కేవలం 35 నిమిషాల్లో పూర్తి చార్జ్ అవుతుందని కంపెనీ వారు చెబుతున్నారు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డాల్బీ అట్మాస్, హై రిజల్యూషన్ ఆడియో టెక్నాలజీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!