ఏపీలో విద్యార్థులు వారి ఇష్టప్రకారమే పాఠశాలకు రావచ్చు
నవంబర్ రెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభిస్తున్న నేపధ్యంలో విద్యార్ధులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎపి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రాజశేఖర్ తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. తొలుత శ్రీనివాసా ధియేటర్ సమీపంలోని గోరంట్ల బిఇడి కళాశాలను పరిశీలించారు. అనంతరం బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికల ప్రాధమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో చేపట్టిన పనులను పరిశీలించారు. వాటి నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా […]
నవంబర్ రెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభిస్తున్న నేపధ్యంలో విద్యార్ధులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎపి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రాజశేఖర్ తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. తొలుత శ్రీనివాసా ధియేటర్ సమీపంలోని గోరంట్ల బిఇడి కళాశాలను పరిశీలించారు. అనంతరం బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికల ప్రాధమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో చేపట్టిన పనులను పరిశీలించారు. వాటి నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నయో తనిఖీ చేశారు. ఒంగోలులో చేపట్టిన నాడు- నేడు పనులు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు వారి ఇష్టప్రకారమే పాఠశాలకు రావచ్చని, పాఠశాలల్లో తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలన్నారు. ఇప్పటికే విద్యార్ధులకు జగనన్న కానుక ద్వారా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశామన్నారు. విద్యార్ధుల ద్వారా వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే పెద్దలకు కరోనా సోకే అవకాశం ఉన్నందున పాఠశాలలకు వచ్చే విద్యార్ధులకు కరోనాపై అవగాహన కల్పిస్తామన్నారు.