ఏపీ: నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు.!

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరులోగా ప్రకటించేందుకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.

ఏపీ: నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు.!
Follow us

|

Updated on: Oct 24, 2020 | 9:47 PM

AP Grama Sachivalayam Exams: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరులోగా ప్రకటించేందుకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్సర్ షీట్ల స్కానింగ్, అభ్యర్థుల వారీగా మార్కుల ప్రక్రియ 75 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద, పొరుగు సేవల పద్దతిలో పని చేస్తూ సచివాలయ పరీక్షలు రాసిన ఉద్యోగులకు.. అలాగే ప్రభుత్వ శాఖలో తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నవారికి 15 మార్కులు వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనితో ఆ ప్రక్రియ పూర్తి కావడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీన్ని కూడా తొందరలోనే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈసారి సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు వెల్లడించనున్నారని తెలుస్తోంది. కాగా, అక్టోబర్ 3 నుంచి నిర్వహించిన రాత పరీక్షలకు ఏపీ వ్యాప్తంగా 7,69,034 మంది అభ్యర్థులు హాజరైన సంగతి విదితమే.