మందుబాబులకు మరో షాక్

ఇతర రాష్ట్రాల నుంచి జోరుగా మద్యం ఏపీకి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్‌ శాఖ... కొత్తగా జీవో నెంబర్ 310ని విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఆంక్షలు పెట్టింది.

  • Sanjay Kasula
  • Publish Date - 5:45 pm, Mon, 26 October 20
మందుబాబులకు మరో షాక్

Import Liquor Ban : ఏపీ ప్రభుత్వం మద్య నిషేధం అంటుంటే.. మందుబాబులు మాత్రం తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి జోరుగా మద్యం ఏపీకి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్‌ శాఖ… కొత్తగా జీవో నెంబర్ 310ని విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఆంక్షలు పెట్టింది. పరిమిట్లు, లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం.

కొత్త జీవోతో గతంలో మాదిరిగా 3 మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు కూడా అనుమతిలేదు. ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్రం నిబంధనల ప్రకారం అనుమతి ఉంది. కానీ.. ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెచ్చేందుకు మాత్రం ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవడంలేదు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.