ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..
ఏపీలోని కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. వారి సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
AP Contract Employees: ఏపీలోని కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. వారి సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయశాఖ, విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖ, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణలోకి తీసుకోవాలని.. సకాలంలో జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పర్మినెంట్ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలు అన్ని కూడా వారికి అందించేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
Also Read: