బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా పట్టాభిషేకం..

బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు.

బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా పట్టాభిషేకం..
Follow us
Balaraju Goud

| Edited By: Ravi Kiran

Updated on: Nov 12, 2020 | 10:01 PM

బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. బహ్రెయిన్‌కు దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రధానిగా కొనసాగిన షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా(84) బుధవారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాను నియమితులయ్యారు. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ ఆర్డర్ జారీ చేశారు. అధికారిక గెజిట్ వెలువడిన వెంటనే రాయల్ ఆర్డర్ అమలులోకి వస్తుందని అధికారవర్గాలు వెల్లడించాయి. అనంతరం ప్రిన్స్ సల్మాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, ప్రిన్స్ సల్మాన్ ప్రస్తుతం బహ్రెయిన్ డిప్యూటీ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇక, అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతూ మృతిచెందిన ప్రధాని ఖలీఫా… ప్రపంచంలోనే అత్యధిక కాలం పాటు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన నేతగా చరిత్రలో నిలిచారు. కింగ్ హమద్ బిన్ ఇసా అల్-ఖలీఫా మామ అయిన ఖలీఫా, 84, 1971 లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి ప్రధానమంత్రిగా పనిచేశారు. అల్-ఖలీఫా కుటుంబం 1783 నుండి బెహ్రెయిన్ దేశాన్ని పాలించింది. సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం వల్ల యువతరం గల్ఫ్ పాలకులలో సామాజిక, ఆర్ధిక సంస్కరణలను తీసుకువస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.