Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్
మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా టైటిల్ ఇటీవలే లాంచ్ అయింది. దీంతో ఈ సినిమాపై హైప్ బాగా క్రియేట్ అయ్యింది. దీనికి తోడు రాజమౌళి- మహేష్ కాంబో కాబట్టి సహజంగానే ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా రాజమౌళి సినిమా అంటే కనీసం 2, 3 ఏళ్లు పడుతుంది. సినిమాలో ప్రతీది పర్ఫెక్ట్ గా రావాలనుకుంటాడు జక్కన్న

విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆడుకునే దర్శక ధీరుడు రాజమౌళికే సాధ్యం కాని సీన్ ఉంటుందా..? ఆయన్నే భయపెట్టేంత గ్రాఫిక్స్ వారణాసిలో ఉండబోతున్నాయా..? షూట్ చేసిన సీన్‌కు VFX చేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా వారణాసిలో సీక్వెన్సులు ఉండబోతున్నాయా..? సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమాపై మరిన్ని అప్‌డేట్స్ రీసెంట్ గా బయటికొచ్చాయి. అవేంటో చూద్దాం..?
ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?
అదేంటో గానీ గత సినిమాలకు భిన్నంగా వారణాసి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు రాజమౌళి. ఇదివరకు తల బాదుకున్నా సింగిల్ అప్‌డేట్ ఇవ్వని రాజమౌళి.. ఇప్పుడు మాత్రం అడక్కుండానే అన్నీ చెప్తున్నారు. మొన్నటికి మొన్న ఒకే ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు మహేష్ అండ్ ప్రియాంక. తాజాగా జక్కన్న సైతం వారణాసిపై హాట్ అప్‌డేట్స్ ఇచ్చారు. ఒక్కటైతే నిజం.. గత సినిమాలతో పోలిస్తే వారణాసి షూటింగ్ రాకెట్ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారు దర్శక ధీరుడు. ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తైంది.. అందులో మేజర్ సీక్వెన్సులు అన్నీ పూర్తి చేసారు జక్కన్న.
కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్
అంతేకాదు తన కెరీర్‌లోనే మోస్ట్ డిఫికల్ట్ సీన్ అయిన రామాయణ సీక్వెన్స్ కూడా పూర్తి చేసినట్లు తెలిపారు రాజమౌళి. విఎఫ్ఎక్స్ కోసం చాలా కష్టపడుతున్నామని తెలిపారు. జూన్ 2026 లోపు వారణాసి షూటింగ్ పూర్తైపోతుందని క్లారిటీ ఇచ్చారు జక్కన్న. జులై నుంచి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ మీదే ఫోకస్ చేయబోతున్నారు. 2027 ఎప్రిల్ 7న విడుదల అని డేట్ ఇచ్చారు టీం. దానికి తగ్గట్లుగానే షూట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక ధీరుడు. మొత్తానికి మర్యాద రామన్న తర్వాత రాజమౌళి అంత వేగంగా పూర్తి చేసిన సినిమా వారణాసే అవుతుందేమో..
నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




