AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఇక పై అలా చేయకూడదు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రెబల్ స్టార్.?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 9న విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

Prabhas: ఇక పై అలా చేయకూడదు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రెబల్ స్టార్.?
Prabhas
Rajeev Rayala
|

Updated on: Feb 14, 2026 | 7:52 AM

Share

డైరెక్టర్స్ విషయంలో ప్రభాస్ ఇంకాస్త కఠినంగా ఉండబోతున్నారా..? నమ్మకం పెట్టుకుని ఛాన్స్ చేసిన చిన్న దర్శకులంతా ముంచేస్తుంటే.. ఇకపై అవకాశం ఇచ్చే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటున్నారా.. విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ సినిమాలు, లార్జన్ దెన్ లైఫ్ క్యారెక్టర్లు ప్రభాస్ నుంచి ఊహించడం కష్టమేనా..? అసలు రెబల్ స్టార్ తీసుకున్న ఆ డిసిషన్ ఏంటి..? బాహుబలితో ఒక్కసారిగా ప్రభాస్ ఎవరెస్ట్ ఎక్కి కూర్చున్నారు. దెబ్బకు ప్యాన్ ఇండియన్ హీరో అయిపోయారు. అంత మార్కెట్ ఉన్నా.. దర్శకుల విషయంలో మాత్రం ఎప్పుడూ పట్టుదలకు పోలేదు ప్రభాస్.

అప్పట్లో ఊపేసింది..! 90’s కిడ్స్ ఫేవరెట్ యాంకర్.. ఈ అమ్మడు గుర్తుందా.?

కథ నచ్చితే చిన్న దర్శకులకు కూడా ఛాన్సిచ్చారు. ఇంకా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రశాంత్ నీల్ మినహా.. ఆయన పని చేసిన దర్శకులంతా మీడియం రేంజే. బాహుబలి లాంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత రన్ రాజా రన్ లాంటి చిన్న సినిమా తీసిన సుజీత్‌ను నమ్మి సాహో చేసారు ప్రభాస్. ఆయన నమ్మకం తెలుగులో నిలబడకపోయినా.. హిందీలో వర్కవుట్ అయింది. ప్రభాస్ ప్యాన్ ఇండియా మార్కెట్ పెరగడంలో సాహో బాగా హెల్ప్ అయింది. కానీ ఆ తర్వాతే ఏ దర్శకుడూ ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

ఎదురు కట్నమైనా ఇస్తా..! అమ్మాయిలో అలాంటి క్వాలిటీస్ ఉండాలి : జబర్దస్త్ నరేష్

జిల్ ఫ్లాపైనా.. రాధాకృష్ణ కుమార్ చెప్పిన కథ నచ్చి రాధే శ్యామ్ చేసారు ప్రభాస్. అది డిజాస్టర్ అయింది.. ఆ తర్వాత ఓం రౌత్‌ను నమ్మి ఆదిపురుష్ చేసి విమర్శల పాలయ్యారు. నాగ్ అశ్విన్ మాత్రమే ప్రభాస్ నమ్మకం వమ్ము చేయకుండా.. కల్కితో 1000 కోట్ల సినిమా ఇచ్చారు. ప్రశాంత్ నీల్ సైతం సలార్‌తో అదిరిపోయే మాస్ ట్రీట్ ఇచ్చారు. మొన్న రాజా సాబ్‌తో మరోసారి ప్రభాస్‌కు షాక్ తప్పలేదు. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన మారుతిని నమ్మి రాజా సాబ్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు ప్రభాస్.. కానీ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే ఇకపై భారీ ప్రాజెక్ట్స్ విషయంలో రిస్క్ తీసుకునేందుకు ప్రభాస్ సిద్ధంగా లేరని తెలుస్తుంది. ప్రస్తుతం రెబల్ స్టార్ చేస్తున్న కల్కి 2, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్ అన్నీ పేరున్న దర్శకులతోనే..!

గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి