AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక తలకిందులు..చిన్న జట్ల దెబ్బకు పెద్ద దేశాలు విలవిల

T20 World Cup 2026 Points Table : టీ20 ప్రపంచ కప్ 2026 అసలు సిసలైన మజాను ఇస్తోంది. టోర్నీలో 26 మ్యాచ్‌లు ముగిసేసరికి పాయింట్ల పట్టిక తలకిందులైంది. ఒకప్పుడు పసికూనలుగా భావించిన జట్లు ఇప్పుడు దిగ్గజ జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి.

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక తలకిందులు..చిన్న జట్ల దెబ్బకు పెద్ద దేశాలు విలవిల
T20 World Cup 2026 Sqauds
Rakesh
|

Updated on: Feb 14, 2026 | 7:08 AM

Share

T20 World Cup 2026 Points Table : టీ20 ప్రపంచ కప్ 2026 అసలు సిసలైన మజాను ఇస్తోంది. టోర్నీలో 26 మ్యాచ్‌లు ముగిసేసరికి పాయింట్ల పట్టిక తలకిందులైంది. ఒకప్పుడు పసికూనలుగా భావించిన జట్లు ఇప్పుడు దిగ్గజ జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా నుంచి జింబాబ్వే వరకు ప్రతి చిన్న జట్టు ఇప్పుడు జెయింట్ కిల్లర్‎గా మారుతుండటంతో సూపర్-8 రేసు రసవత్తరంగా మారింది.

గ్రూప్-A: అమెరికా గర్జన

చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 93 పరుగుల తేడాతో మట్టికరిపించిన అమెరికా, పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్‌లో 196 పరుగులు చేసిన అమెరికా, తర్వాత డచ్ జట్టును కేవలం 103 పరుగులకే కుప్పకూల్చింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ నాలుగో స్థానానికి పడిపోగా.. భారత్ అగ్రస్థానంలో, పాకిస్థాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. అమెరికా దూకుడు చూస్తుంటే సూపర్-8 రేసులో ఏవైనా అద్భుతాలు జరగొచ్చనిపిస్తోంది.

గ్రూప్-B: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్

ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అప్‌సెట్ ఇదే. పటిష్టమైన ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి జింబాబ్వే సంచలనం సృష్టించింది. దీంతో 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో జింబాబ్వే రెండో స్థానానికి చేరగా, శ్రీలంక మొదటి స్థానంలో ఉంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోవడంతో ఆ జట్టు సూపర్-8 అవకాశాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఐర్లాండ్, ఒమన్ జట్లు ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు.

గ్రూప్-C: ఇంగ్లాండ్‌కు ఇటలీ సెగ

వెస్టిండీస్ రెండు విజయాలతో గ్రూప్-Cలో టాప్‌లో ఉండగా, ఇటలీ , స్కాట్లాండ్ జట్లు ఇంగ్లాండ్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. నెట్ రన్ రేట్ కారణంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఇటలీ వంటి చిన్న జట్టు మూడవ స్థానంలో ఉండటం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేపాల్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి అట్టడుగున నిలిచింది.

గ్రూప్-D: న్యూజిలాండ్ ఆధిపత్యం

ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా తలో 4 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే అనూహ్యంగా యూఏఈ జట్టు కెనడాపై గెలిచి మూడో స్థానానికి ఎగబాకింది. ఆశ్చర్యకరంగా ఆఫ్ఘనిస్థాన్ ఇంకా తన తొలి గెలుపు కోసం ఎదురుచూస్తూ నాలుగో స్థానంలో ఉంది. ఈ గ్రూప్‌లో కివీస్ తన ఆధిపత్యాన్ని చాటుతూ సూపర్-8కు దాదాపు అర్హత సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..