AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజు నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్

AP Emcet Web Counseling : ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది.  ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో వెబ్ కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయ‌గా, గిరిజన విద్యార్ధుల కోసం […]

ఈ రోజు నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్
Sanjay Kasula
|

Updated on: Oct 23, 2020 | 2:00 AM

Share

AP Emcet Web Counseling : ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది.  ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో వెబ్ కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయ‌గా, గిరిజన విద్యార్ధుల కోసం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.

ర్యాంకులవారిగా కౌన్సిలింగ్

ఈ రోజు ఒకటో ర్యాంక్ నుంచి 20వేల వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నుండ‌గా, 24న 20,001 ర్యాంక్ నుంచి 50వేల వ‌ర‌కు 25న 50,001 ర్యాంక్ నుంచి 80వేల వరకు 26న 80,001 ర్యాంక్ నుంచి 1.10లక్షల వరకు 27న 1,10,001 నుంచి చివరి ర్యాంక్‌ వరకు వెబ్ కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది.