నేడు ఢిల్లీకి జగన్ పయనం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 9.30కి తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీ బయల్దేరనున్న సీఎం.. మధ్యాహ్నం 2.30కి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న జగన్.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాలు, పోలవరం టెండర్ల రద్దు వంటి అంశాలపై చర్చించనున్నారు. […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 9.30కి తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీ బయల్దేరనున్న సీఎం.. మధ్యాహ్నం 2.30కి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న జగన్.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాలు, పోలవరం టెండర్ల రద్దు వంటి అంశాలపై చర్చించనున్నారు. కాగా బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌లను జగన్ కలవనున్నారు.