కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు.. జగన్ సర్కార్ సంచలనం..

Corona Patients Cremation: రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల విషయంలో తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి గుర్తింపు రద్దు..  కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు నిరాకరించకూడదని, అలా నిరాకరిస్తే ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు. […]

కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు.. జగన్ సర్కార్ సంచలనం..
Follow us

|

Updated on: Jul 15, 2020 | 1:24 AM

Corona Patients Cremation: రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల విషయంలో తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రి గుర్తింపు రద్దు.. 

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు నిరాకరించకూడదని, అలా నిరాకరిస్తే ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రత్యేక బస్సుల ద్వారా కోవిడ్ టెస్టులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కరోనాపై ప్రజలను నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లపై వచ్చే వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

విస్తృతంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి..

కరోనా పరీక్షలు చేయించుకునేందుకు శాశ్వత కేంద్రాలు ఉండాలన్న జగన్.. అవి ఎక్కడున్నాయో ప్రజలకు తెలిసేలా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే హైరిస్క్ క్లస్టర్లలో కూడా కోవిడ్ టెస్టులు చేసేందుకు ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలని సీఎం జగన్ అధికారులకు వివరించారు. రాష్ట్రంలో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వైద్యులు, నర్సుల నియామకం.. 

కాగా, కరోనా వైరస్ వ్యాప్తి, మున్ముందు అవసరాల దృష్ట్యా సరైన ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలని సీఎం తెలిపారు. అలాగే అవసరాలకు అనుగుణంగా వైద్యులు, నర్సులను నియామకాలను చేపట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Also Read: సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..