AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హస్తినకు బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర మంత్రులతో సమావేశం..పోలవరంతోపాటు ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు...

హస్తినకు బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర మంత్రులతో సమావేశం..పోలవరంతోపాటు ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం
Sanjay Kasula
| Edited By: |

Updated on: Dec 15, 2020 | 3:33 PM

Share

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి చెందిన ఇతర అంశాలను అమిత్‌ షా దృష్టికి సీఎం తీసుకువెళతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

పోలవరంతో పాటు.. ఏడు వెనుకబడ్డ జిల్లాలకు నిధులు కోరనున్నారు. మూడు రాజధానులపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు సీఎం జగన్‌. అమరావతి ఏపీ రాజధాని అంటూ బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు కామెంట్స్ నేపథ్యంలో.. ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.