ఏపీ బడ్జెట్ అప్డేట్స్: ఏయే రంగానికి ఎంత కేటాయించారంటే..!
వైఎస్ జగన్ ప్రభుత్వం రెండోసారి వార్షిక ఆర్ధిక బడ్జెట్ 2020-21ని ప్రవేశపెట్టింది. రూ. 2.24 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఈ బడ్జెట్ రూపొందించారు. తెలుగు కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన.. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామన్నారు. కేటాయింపులు ఇలా ఉన్నాయి.. వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. […]
వైఎస్ జగన్ ప్రభుత్వం రెండోసారి వార్షిక ఆర్ధిక బడ్జెట్ 2020-21ని ప్రవేశపెట్టింది. రూ. 2.24 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఈ బడ్జెట్ రూపొందించారు. తెలుగు కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన.. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామన్నారు.
కేటాయింపులు ఇలా ఉన్నాయి..
- వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. 200 కోట్లు
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ. 109.75 కోట్లు..
- జగనన్న తోడు రూ. 100 కోట్లు
- ఇమామ్‌లు, మౌజామ్‌లకు రూ. 50 కోట్లు
- న్యాయ నేస్తం కోసం రూ. 12.75 కోట్లు
- జెరూసలెం పవిత్ర యాత్రకు రూ. 5 కోట్లు
- రైతులకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 11 వేల కోట్లు
- రైతు భరోసా కేంద్రాల కోసం రూ. 100 కోట్లు
- రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం రూ. 54. 51 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధి – రూ. 3 వేల కోట్లు
- వడ్డీ లేని రుణాల కోసం – రూ. 1,100 కోట్లు
- మైనారిటీ సంక్షేమానికి రూ. 2,055.63 కోట్లు
- ఎస్టీల సంక్షేమానికి రూ. 1,840 కోట్లు
- ఎస్సీల సంక్షేమానికి రూ. 7,525 కోట్లు
- కాపుల సంక్షేమానికి రూ. 2,845 కోట్లు
- బీసీల సంక్షేమానికి రూ. 23, 406 కోట్లు
- విద్యకు రూ. 22,604 కోట్లు
- వ్యవసాయ రంగానికి రూ. 11, 891 కోట్లు
- అభివృద్ధి పధకాలకు రూ. 84,140.78 కోట్లు
- వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ. 3651 కోట్లు
- రేషన్ బియ్యానికి రూ. 3 వేల కోట్లు
- వైఎస్ఆర్ గృహ వసతికి రూ. 3 వేల కోట్లు
- ఆరోగ్యశ్రీకి రూ. 2100 కోట్లు
- వైద్య రంగానికి రూ. 11, 419 కోట్లు
- షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ. 15, 735 కోట్లు
- వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ. 16 వేల కోట్లు
- వైఎస్ఆర్ ఆసరా రూ. 6300 కోట్లు
- హోంశాఖకు రూ. 5988 కోట్లు
- అమ్మఒడి పధకానికి రూ. 6 వేల కోట్లు
- జగనన్న విద్యాదీవెన కోసం రూ. 3009 కోట్లు
- జగనన్న వసతి దీవెన కోసం రూ. 2 వేల కోట్లు
- వైఎస్ఆర్ చేయూత కోసం రూ. 3 వేల కోట్లు
- బలహీన వర్గాల గృహ నిర్మాణం కోసం రూ. 150 కోట్లు
- వైఎస్ఆర్ కాపు నేస్తం రూ. 350 కోట్లు
- వైఎస్ఆర్ వాహనమిత్ర రూ. 275.51 కోట్లు
- వైఎస్ఆర్ జగనన్న చేదోడు రూ. 247.04 కోట్లు