ఏ సోర్టీనైనా ‘ఆహా’ లాంటి ఓటీటీల ద్వారా రిలీజ్ చేయవచ్చుః అరవింద్
కోవిడ్ నుండి 2-3 నెలల్లో బయట పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాని పేర్కొన్నారు టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కథను తెరపైకి తీసుకురాలేం. కానీ ఆహా లాంటి ఓటీటీ వల్ల నిర్మాతగా ఎక్కువ కాన్సెప్ట్‌లను ప్రజలకు చేర వేసే..
కోవిడ్ నుండి 2-3 నెలల్లో బయట పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాని పేర్కొన్నారు టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కథను తెరపైకి తీసుకురాలేం. కానీ ఆహా లాంటి ఓటీటీ వల్ల నిర్మాతగా ఎక్కువ కాన్సెప్ట్‌లను ప్రజలకు చేర వేసే అవకాశం కలుగుతుంది. ఎప్పటికైనా సినిమాను మించింది లేదు. ప్రేక్షకుడికి సినిమా థియేటర్‌లో కూర్చున్నప్పుడు ఓ అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. థియేటర్స్ ఓపెన్ అయితే ఓవర్ ఫ్లో ఉండదు కానీ.. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఫ్లో పెరుగుతుంది. ఆగస్ట్ నెలలో స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి పండగలు ఉన్నాయి. కాబట్టి ఆహాలో దీన్ని ఫెస్టివల్ నెలగా ప్రకటించాం. దసరా సందర్భంలోనూ ఫెస్టివల్ నెలను ప్రకటిస్తాం.
ఆరు నెలల కాలంలో ఆహా యాప్‌ను దాదాపు నలబై లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 6 నెలల కాలంలో ఆహా కంటెంట్ ఎలా ఉందని సెర్చ్ చేసిన వాళ్ల సంఖ్య కోటి ఇరవై లక్షలకి చేరింది. ఏడాదిన్నర కాలంలో ఎంత మంది ప్రేక్షకులను రీచ్ అవుతామనుకున్నామో దాన్ని ఆరు నెలల కాలంలోనే రీచ్ అయిపోయాం. వచ్చే ఏడాది ఇదే సమయానికి రెండు, మూడు రెట్లు ప్రేక్షకులు ఆహా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారని భావిస్తున్నాం. భవిష్యత్తులో ఏటీటీకి మంచి అవకాశం ఉంటుంది.
భవిష్యత్తులో ఏటీటీలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుంది. 42 షోస్ ప్లానింగ్‌లో ఉన్నాయి.. వాటిలో వచ్చే ఏడాది జూన్ కంతా వీలైనన్నీ షోస్‌ను రెడీ చేస్తాం. సెప్టెంబర్‌లో ఎక్కువ శాతం షూటింగ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రెండు, మూడేళ్లలో పెద్ద పెద్ద స్టార్స్ ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఆహా కోసం మెగాస్టార్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆయనకు కాన్సెప్ట్ నచ్చితే చాలని పేర్కొన్నారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.
Read More:
ఇకపై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్! ఎలాగంటే?
కోమాలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిటల్
భారత క్రికెటర్‌కి కరోనా వైరస్ పాజిటివ్
అభిరామ్ యాక్సిడెంట్ చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీ