ఇక‌పై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్‌! ఎలాగంటే?

ఇక‌పై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్ తీసుకోవ‌చ్చు. అదెలాగ అంటారా? స్పైట్‌జెట్ విమాన‌యాన సంస్థ స‌రికొత్త సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు వెబ్‌సైట్‌, మొబైల్ యాప్ ద్వారా అందించిన సేవ‌ల‌ను వాట్సాప్‌లోనూ..

ఇక‌పై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్‌! ఎలాగంటే?
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 7:39 PM

ఇక‌పై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్ తీసుకోవ‌చ్చు. అదెలాగ అంటారా? స్పైట్‌జెట్ విమాన‌యాన సంస్థ స‌రికొత్త సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు వెబ్‌సైట్‌, మొబైల్ యాప్ ద్వారా అందించిన సేవ‌ల‌ను వాట్సాప్‌లోనూ అందించేందుకు సిద్ధ‌మైంది. 60000 00006 వాట్సాప్ నెంబ‌ర్‌పై ప్రయాణికుల‌కు ఎల్ల‌వేళ‌లా స్పైస్ జెట్ ఆటోమేటెడ్ ఏజెంట్ మిస్ పెప్ప‌ర్ అందుబాటులో ఉంటుంది. వాట్సాప్‌లో మీ సందేహాల‌ను పంపించిన‌ వెంట‌నే.. మిస్ పెప్ప‌ర్ రిప్లై ఇస్తుంది. అంతేకాదు బోర్డింగ్ పాస్ కూడా మీ ఫోన్‌కు మెసేజ్ రూన‌పంలో పంపేస్తుంది.

ఇప్పుడు అంద‌రి ప్ర‌యాణికులు వ‌ద్ద వాట్సాప్ ఉంటూండ‌టంతో.. ప్ర‌యాణికుల‌ సౌక‌ర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది స్పైస్ జెట్‌. మే 25న దేశీయ విమాన‌యానానికి అనుమ‌తులిస్తూ కొన్ని దేశాలను భార‌త ప్ర‌భుత్వం జారీ చేసిన విష‌యం తెలిసిందే. భౌతిక దూరం, ఇత‌ర క‌రోనా జాగ్ర‌త్త‌ల దృష్ట్యా.. విమానం క‌ద‌ల‌డానికి 48 గంట‌ల ముందే ఆన్‌లైన్‌లో చెక్ ఇన్ అవ్వాల‌ని సూచించింది. దీంతో స్పైస్ జెట్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ సేవ‌లు వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

Read More:

కోమాలో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిట‌ల్‌

భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌

అభిరామ్ యాక్సిడెంట్ చేయ‌లేదు.. క్లారిటీ ఇచ్చిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ