దూకుడు పెంచిన మలయాళీ భామ.. తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న అనుపమ పరమేశ్వరన్

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో తన దూకుడు పెంచింది. తెలుగులో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ.

  • Rajeev Rayala
  • Publish Date - 8:23 am, Sat, 19 December 20
దూకుడు పెంచిన మలయాళీ భామ.. తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న అనుపమ పరమేశ్వరన్

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో తన దూకుడు పెంచింది. తెలుగులో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. యంగ్ హీరో నిఖిల్ సరసన ’18 పేజీస్’ అనే సినిమా చేస్తుంది అనుపమ. సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

మరోవైపు దిల్ రాజు బందూకు ఆషిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న సినిమాలోనూ అనుపమ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ మూవీని ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ‘రౌడీ బోయ్స్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో ‘హెలెన్’ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను కూడా అనుపమ తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రాన్ని పీవీవీ సంస్థతో కలిసి దిల్ రాజు నిర్మించనున్నారు. ఇలా వరుసగా తెలుగులో మూడు సినిమాలను లైన్ లో పెట్టింది ఈ కేరళ కుట్టి.