మహబూబ్ నగర్‌లో భారీ చోరీ.. పెళ్లి కోసం దాచిపెట్టిన 200 తులాల బంగారం మాయం..

మహబూబ్‌నగర్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో అందరూ ఉండగానే భారీ చోరికి తెగబడ్డారు. అర్ధరాత్రి ఇంట్లోకి..

  • Narender Vaitla
  • Publish Date - 8:28 am, Sat, 19 December 20
మహబూబ్ నగర్‌లో భారీ చోరీ.. పెళ్లి కోసం దాచిపెట్టిన 200 తులాల బంగారం మాయం..

మహబూబ్‌నగర్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో అందరూ ఉండగానే భారీ చోరికి తెగబడ్డారు. అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన దుండులు.. ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉండగా సైలెంట్‌గా తమ పనిని పూర్తి చేసుకెళ్లారు. పెళ్లి కోసం దాచి వుంచిన 200 తులాల బంగారం సహా రూ. 8 లక్షల నగదు అపహరించుకుపోయారు. దీంతో బాధిత కుటుంబం బోరున విలపిస్తోంది.

 

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌ పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఆయన కూతురు వివాహం కోసం దాచి వుంచి నగలతో పాటు కుటుంబ సభ్యుల ఆభరణాలను సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. దాంతోపాటుగా రూ.8 లక్షల నగదును కూడా దొంగలు దోచుకెళ్లారు. ఆ సమయంలో వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున లేచి చూసే సరికి ఇంట్లోని సొమ్ము అంతా మాయమైంది. దీంతో లబోదిబోమనడం వారి వంతైంది. చోరీ విషయం తెలుసుకున్న మిడ్జిల్ ఎస్సై సురేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దోపిడీకి గురైన ఇంటిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీకి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. కాగా, మరికొద్ది గంటల్లో కూతురు పెళ్లి ఉండగా.. ఇంట్లోని సొమ్మంతా దొంగలపాలవడంతో కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

Also read:

పెళ్లి బారాత్‌లో తుపాకీ కాల్పులు: గన్ తో పెళ్లికొడుకు డ్యాన్స్, కత్తులు, తల్వార్లతో మిత్రుల హంగామా..హడలెత్తిన జనం.!

అన్నదాతలకు మద్దతు తెలిపిన బాలీవుడ్ నటి.. స్వయంగా రైతుల ఆందోళనలో పాల్గొన్న స్వరభాస్కర్