కొవిడ్ వార్డులో సేవలందించేందుకు మరో మెడి రోబో’ రెఢీ
కరోనాతో దేశం అల్లకల్లోలమవుతోంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్ ఫ్రంట్ వారియర్స్ కు మేము అంటూ సేవలందిస్తుంది రైల్వే శాఖ.
కరోనాతో దేశం అల్లకల్లోలమవుతోంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్ ఫ్రంట్ వారియర్స్ కు మేము అంటూ సేవలందిస్తుంది రైల్వే శాఖ. తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్‌లోని డీజిల్ లోకో షెడ్‌లో మరో రోబో సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న నమూనాకు మరిన్ని హంగులతో తీర్చిదిద్దారు. సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ ఎస్.ఎం.పాత్రో ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఈ రోబోను భువనేశ్వర్‌లోని తూర్పు కోస్తా రైల్వే ప్రధాన ఆసుపత్రి కొవిడ్ వార్డులో సేవలందించేందుకు రెఢీ అయ్యింది. కొవిడ్ వార్డులో పని చేసే నర్సులు, సిబ్బంది, డాక్టర్లకు ఉపయోగకరంగా ఉండేలా ఇప్పటికే ఒక ‘మెడి రోబో’ను రూపొందించిన రైల్వే శాస్త్రవేత్తలు.. వాల్తేర్ రైల్వే ఆసుపత్రికి అందజేశారు. చీఫ్ మెకానికల్ ఇంజినీర్ గీతం దత్తా ఆదేశాలతో సిద్ధం చేసిన రోబో విశేషాలను పాత్రో వివరించారు.
రోబో ప్రత్యేకతలు :
- కొవిడ్ వార్డులోకి భౌతికంగా మనిషి వెళ్లే అవసరం లేకుండా రోగులకు ఆహారం, మందులు రోబో ద్వారా అందిస్తుంది.
- దీన్ని పూర్తి రిమోట్ ద్వారా నియంత్రించవచ్చుజ
- కొవిడ్ బాధితుని ఉష్ణోగ్రత తెలియజేస్తుంది.
- 360 డిగ్రీల కోణంలో అమర్చిన కెమెరా బాధితుని దగ్గర పరసరాల్లో పరిస్థితి రికార్డు చేస్తుంది.
- విధుల అనంతరం వైద్య సిబ్బంది తమ వస్తు సామగ్రిని ఇందులో ఉంచి యూవీ కిరణాల ద్వారా శానిటైజ్ చేయవచ్చు.
- కరెన్సీ నోట్లు, హ్యాండ్ బ్యాగ్, పర్సులు, బెల్ట్‌లు శానిటైజ్ చేసుకోవడానికి చాంబర్లను అమర్చారు.