ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే.!
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 71,806 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,133 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Coronavirus Positive Cases: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 71,806 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,133 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. ఇందులో 58,445 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,29,211 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 48 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,828కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 58.06 లక్షల కరోనా టెస్టులు జరిగాయి.
నిన్న కోవిడ్ వల్ల చిత్తూరులో ఎనిమిది, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. అనంతపురం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున.. కడపలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 97 వేలు దాటగా.. చిత్తూరులో అత్యధికంగా 655 మంది కరోనాతో మరణించారు.
#COVIDUpdates: 30/09/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 6,90,589 పాజిటివ్ కేసు లకు గాను *6,26,316 మంది డిశ్చార్జ్ కాగా *5,828 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 58,445#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XjjJwVWdhR
— ArogyaAndhra (@ArogyaAndhra) September 30, 2020