ఆండ్రాయిడ్ యూజర్లకు అలెర్ట్ !
ఆండ్రాయిడ్ వినియోగదారుల ముఖ్య గమనిక వచ్చింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను లక్ష్యంగా చేసుకునే కొత్త రాన్సమ్‌వేర్‌ను మైక్రోసాఫ్ట్ కనుగొంది.

ఆండ్రాయిడ్ వినియోగదారుల ముఖ్య గమనిక వచ్చింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను లక్ష్యంగా చేసుకునే కొత్త రాన్సమ్‌వేర్‌ను మైక్రోసాఫ్ట్ కనుగొంది. దాని గురించి హెచ్చరికను విడుదల చేసింది. నివేదికల ప్రకారం, ఈ రాన్సమ్‌వేర్‌ని మాల్‌లాకర్.బి అని పిలుస్తారు. ఇది ఆన్‌లైన్ ఫోరమ్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వ్యాప్తి చెందుతోంది. అత్యంత ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఇది దాగి ఉంటుందని తెలిపింది. వెబ్‌సైట్‌ల నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ వైరస్ సులువుగా ఇతర ఫోన్లకు విస్తరిస్తుందని హెచ్చరించింది. వినియోగదారులు తెలియని సోర్స్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. ( Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ ! )
ఈ రాన్సమ్‌వేర్ దాడి చేయడం వల్ల స్క్రీన్ యాక్సిస్ నిలిచిపోతుంది. మిగతా రాన్సమ్‌వేర్స్‌లా కాకుండా మాల్‌లాకర్.బి మాల్‌వేర్ ఫోన్‌ను ఎన్ క్రిప్ట్ చెయ్యదు. ఒక మెసేజ్ ద్వారా ఫోన్ డిస్‌ప్లేను నిలిచిపోయేలా చేస్తుంది. స్క్రీన్ అన్‌లాక్ చెయ్యాలంటే ఫైన్ కట్టాలని చెబుతుంది. అయితే దీని వల్ల వ్యక్తిగత సమాచారం లీకవుతుంది అనే దానికి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ( పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక )
