టీటీడీ పాలకమండలి సభ్యుల రాజీనామాల ఆమోదం
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన వేళ.. టీటీడీ పాలకమండలిలో సభ్యులైన రమేష్ బాబు, చల్లా రామచంద్రారెడ్డి, రాఘవేంద్రరావులు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాజీనామా పత్రాలు తాజాగా ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే మరోవైపు టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకునేందుకు పుట్టా సుధాకర్ ససేమిరా అంటున్నారు. కావాలంటే పాలకమండలిని రద్దు చేసుకోండి అంటూ ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పుట్టా సుధాకర్‌తో మరికొందరు సభ్యులు కూడా తమ పదవుల నుంచి తప్పుకోవడం […]
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన వేళ.. టీటీడీ పాలకమండలిలో సభ్యులైన రమేష్ బాబు, చల్లా రామచంద్రారెడ్డి, రాఘవేంద్రరావులు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాజీనామా పత్రాలు తాజాగా ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే మరోవైపు టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకునేందుకు పుట్టా సుధాకర్ ససేమిరా అంటున్నారు. కావాలంటే పాలకమండలిని రద్దు చేసుకోండి అంటూ ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పుట్టా సుధాకర్‌తో మరికొందరు సభ్యులు కూడా తమ పదవుల నుంచి తప్పుకోవడం లేదు. కాగా సభ్యులు రాజీనామా చేయకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 8న జరిగే కేబినెట్ బేటీలో టీటీడీ బోర్డు రద్దుపై నిర్ణయం తీసుకొని.. గవర్నర్‌కు పంపే యోచనలో వైఎస్ జగన్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక టీటీడీతో పాటు అన్ని దేవాలయాల బోర్డులను రద్దు చేసేలా ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకురాబోతుంది.