తిరుపతిలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు, రెండు రాజకీయ తీర్మానాలు.. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తోందన్న నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ తమ ప్రాభవాన్ని చాటుకోవలన్న తలంపు, ఉత్సాహం తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ప్రస్పుటమైంది. ఈ సమావేశాల్లో..

తిరుపతిలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు, రెండు రాజకీయ తీర్మానాలు.. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తోందన్న నేతలు
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 12, 2020 | 8:15 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ తమ ప్రాభవాన్ని చాటుకోవలన్న తలంపు, ఉత్సాహం తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ప్రస్పుటమైంది. ఈ సమావేశాల్లో రెండు రాజకీయ తీర్మానాలు ఆమోదించిన సభ్యులు, సంక్షేమం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ వాలంటీర్లు ప్రజల్ని జలగల్లా పీక్కు తింటున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కనిపిస్తోందని, శాసనసభలో, మండలిలో ప్రభుత్వం నిబంధనలు గాలికి వదిలి బూతులతో రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 50 లక్షల కుటుంబాల భవన నిర్మాణ కుటుంబాలకు అండగా బీజేపీ త్వరలో ఆందోళనలు చేస్తుందని వెల్లడించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఇంచార్జి మురళీధరన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతూ బీజేపీని బలోపేతంచేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలు, నేతలకు ఉద్బోధించారు. ప్రధాని నరేంద్రమోదీ అమలు పరుస్తోన్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.