జియో అండ్ రియల్ మీ జత… తక్కువ ధరకే 4జీ ఫోన్లు అందించేందుకు…. 5జీ ఫోన్ల తయారీ కూడా…
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో రియల్ మీ, మరో సంస్థతో జతకట్టేందుకు రెడీ అవుతోంది. దేశంలోని సెల్ ఫోన్ వినియోగదారులకు 4జీ, 5జీ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో రియల్ మీ, మరో సంస్థతో జతకట్టేందుకు రెడీ అవుతోంది. సాంకేతిక నిపుణులు, సంస్థల ప్రతినిధుల కథనం ప్రకారం…. రెండు సంస్థలు కలిసి పని చేయబోతున్నాయి. తక్కువ ధరకు 4 జీ ఫోన్లను అందించడంతో పాటు… రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే 5జీ నెట్వర్కు అనుగుణమైన ఫోన్ల తయారీకి సిద్ధం కానున్నాయి.
ఇప్పటికీ 2జీ ఫోన్లే….
కాగా, దేశంలో ఇప్పటికీ చాలా మంది 2జీ ఫోన్లే వాడుతున్నారని రిలయన్స్ జియో వస్తువులు, సేవల విభాగం ప్రెసిడెంట్ సునీల్ దత్త్ అన్నారు. ఇక రియల్ మీ సీఈఓ మాధవ్ సేత్ మాట్లాడుతూ… దేశంలోని పౌరులకు 5జీ సేవలు అందించేందుకు తాము రెడీగా ఉన్నామని అన్నారు. వారికి తక్కువ ధరకు అందుబాటులో ఉండే విధంగా 5జీ టెక్నాలజీ కలిగిన ఫోన్లను అందిస్తాని తెలిపారు.
మీడియా టెక్ సంస్థ భారతీయ మేనేజింగ్ డైరెక్టర్ జైన్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సాంకేతిక విప్లవం సంభవించబోతోందని అన్నారు. కృతిమ మేధ, రోబోలు, డ్రోన్లు, ఆటోమెటిక్ వాహనాలు ఇలా అన్ని విభాగాల్లో సాంకేతికత మెరుగవబోతోందని అన్నారు. 2021 వరకు భారత దేశంలో 5జీ సేవలు అందబోతున్నాయని, దానికి అనుగుణంగా సాంకేతికతతో కూడిన సెల్‌ఫోన్ పరికరాలను తయారు చేస్తామని ప్రకటించారు.