AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై దాడి ఘ‌ట‌న‌లో కేంద్రం సీరియ‌స్‌.. బెంగాల్ పోలీసు అధికారుల‌పై కొర‌ఢా

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌లో కేంద్రం కొర‌ఢా ఝులిపించింది. దాడి నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి

జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై దాడి ఘ‌ట‌న‌లో కేంద్రం సీరియ‌స్‌.. బెంగాల్ పోలీసు అధికారుల‌పై కొర‌ఢా
uppula Raju
|

Updated on: Dec 12, 2020 | 7:46 PM

Share

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌లో కేంద్రం కొర‌ఢా ఝులిపించింది. దాడి నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. బెంగాల్ లో పని చేస్తున్న అధికారులను డిప్యూటేషన్ పై కేంద్రంలోకి రప్పిస్తూ హోం మంత్రిత్వ శాఖ శనివారం సమన్లు జారీ చేసింది. పశ్చిమబెంగాల్ కేడర్లో విధులు నిర్వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎస్పీ భోల్‌నాథ్ పాండే , ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్ర‌వీణ్ త్రిపాఠ‌, దక్షిణ బెంగాల్ అద‌న‌పు డీజీ రాజీవ్ మిశ్రాల‌ను కేంద్రంలో ప‌ని చేయాల‌ని ఆదేశించింది. న‌డ్డా ప‌ర్య‌ట‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైనందున ఈ స‌మ‌న్లు జారీ చేస్తున్న‌ట్లు కేంద్రం హోంశాఖ తెలిపింది.

ఆల్ ఇండియా స‌ర్వీస్ అధికారుల‌పై ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఈ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు కేంద్రంహోం శాఖ వెల్ల‌డించింది. కాగా, సాధార‌ణంగా అఖిల భార‌త స‌ర్వీసు అధికారిని డిప్యుటేష‌న్‌పై కేంద్రంలోకి తీసుకునే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌మ్మ‌తితో తీసుకుంటారు. అయితే తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో కేంద్రం హోంశాఖ బెంగాల్ ప్ర‌భుత్వం స‌మ్మ‌తి లేకుండానే ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఏడుగురి అరెస్టు కాగా, ఈ దాడి గురువారం జ‌రుగ‌గా, దాడికి సంబంధించిన ఘ‌ట‌న‌లో మూడు ఎఫ్ ఐఆర్‌లు న‌మోదు చేయ‌డంతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారంటూ రెండు సుమోటో ఎఫ్ ఐఆర్‌ల‌ను పోలీసులు న‌మోదు చేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొనేందుకు ద‌క్షిణ జిల్లాలోని డైమండ్ హార్బ‌ర్‌కు వెళ్తుండ‌గా టీఎంసీ కార్య‌క‌ర్త‌లు న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్ల‌తో దాడి చేశారు. అయితే ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ప‌శ్చిమ బెంగాల్‌లో నెల‌కొన్న‌ శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌పై త‌క్ష‌ణ‌మే నివేదిక‌ను అందించాల‌ని గ‌వ‌ర్న‌ర్ ధ‌న్క‌ర్‌ను కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు.

Follow Us
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?