AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయినా.. బ్రతికే ఉన్న ఆనం వివేకా…

ఆనం వివేకా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చెబితే గుర్తుపట్టని వ్యక్తి ఉండరు. 1999 నుంచి 2014వరకు..15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా సేవలందించారు ఆయన. వివేకాకు స్టైల్ ఆఫ్ సింహపురి అనే పేరుంది. వాడి, వేడి మాటలతో రాష్ట్ర రాజకీయాలను వేడిక్కించడమే కాదు..వినూత్న ప్రవర్తనతోనూ వార్తల్లో వ్యక్తిగా ఉండటం ఆయనకు అలవాటుగా ఉండేది. వివేకా… పాటలు పాడేవారు, ఆటలు ఆడేవారు, సినిమా హీరోల్లా స్టైలిస్ స్టెప్పులు వేసేవారు. పబ్లిక్‌గా స్మోక్ చెయ్యడం, ప్రత్యర్థులపై పంచ్‌లు వెయ్యడం..ఇలా ఆయన […]

చనిపోయినా.. బ్రతికే ఉన్న ఆనం వివేకా...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 19, 2020 | 4:49 PM

Share

ఆనం వివేకా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చెబితే గుర్తుపట్టని వ్యక్తి ఉండరు. 1999 నుంచి 2014వరకు..15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా సేవలందించారు ఆయన. వివేకాకు స్టైల్ ఆఫ్ సింహపురి అనే పేరుంది. వాడి, వేడి మాటలతో రాష్ట్ర రాజకీయాలను వేడిక్కించడమే కాదు..వినూత్న ప్రవర్తనతోనూ వార్తల్లో వ్యక్తిగా ఉండటం ఆయనకు అలవాటుగా ఉండేది. వివేకా… పాటలు పాడేవారు, ఆటలు ఆడేవారు, సినిమా హీరోల్లా స్టైలిస్ స్టెప్పులు వేసేవారు. పబ్లిక్‌గా స్మోక్ చెయ్యడం, ప్రత్యర్థులపై పంచ్‌లు వెయ్యడం..ఇలా ఆయన ఏం చేసినా ఓ సంచలనమే అయ్యేది. ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్‌లో నెల్లూరు స్లాంగ్‌లో మాట్లాడే మాటలైతే..సినిమాల్లోని హీరోలు పంచ్‌ డైలాగ్‌ల కంటే ఎక్కువ వాడుకలో ఉంటాయి.

ఆనం వివేకా అనారోగ్య కారణాలతో 2018, ఏప్రిల్ 25 న మృతి చెందిన సంగతి తెలిసిందే. అయినా ఆనం నిత్యం సోషల్ మీడియాలో జనం కంట్లో పడుతూనే ఉంటారు. తెలుగు ప్రజలను నిత్యం తన మాటల గారడితో ఆకట్టుకుంటూనే ఉన్నారు. అదెలాగ అంటారా..?. బర్నింగ్ టాపిక్ ఏదైనా సరే..మీమ్స్ చేసేవాళ్లకు ఆనం వివేకా ఓ సూపర్‌స్టార్. ఆయన వీడియో క్లిప్ పడందే..సదరు మీమ్ అంతగా పేలదు. “ఓరినీ…బడవ..ఇదేందయ్యా..ఇది”…సోషల్ మీడియాను ఫాలో అయ్యేవాళ్లకు ఈ డైలాగ్ వినకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అలా చనిపోయినప్పటికి తన వాక్చాతుర్యంతో, పవర్‌ఫుల్ పంచ్‌ డైలాగ్స్‌తో నిత్యం జనం గుండెల్లో బ్రతికే ఉంటున్నారు వివేకా.