ఆర్టీసీ బస్సులో దారుణం.. సీట్లోంచి లేవమన్నందుకే.. కత్తితో దాడి
ఆర్టీసీ బస్సులో దారుణం చోటుచేసుకుంది. లేడీస్ సీట్లోంచి లేవమన్నందుకు కత్తితో దాడి చేశాడు గుర్తుతెలియని దుండగుడు. హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో ప్రయాణిస్తోన్న..
Crime News: ఆర్టీసీ బస్సులో దారుణం చోటుచేసుకుంది. లేడీస్ సీట్లోంచి లేవమన్నందుకు కత్తితో దాడి చేశాడు గుర్తుతెలియని దుండగుడు. హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో ప్రయాణిస్తోన్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. బస్సులో మహిళపై కత్తితో దాడి చేశాడు నిందితుడు. లేడీస్ సీట్లో కూర్చున్న వ్యక్తిని లేవమన్నందుకు.. అనురాధ అనే మహిళపై దాడి చేశాడు. అనంతరం రన్నింగ్ బస్సులో నుంచి దూకి పారిపోయాడు దుండగుడు. కాగా ఈ దాడిలో మహిళ స్వల్పంగా గాయపడింది. దీంతో.. బాధితురాలితో పాటు బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.