Superb Lyrebird: కోడి, నెమలి కలయిక ఈ పక్షి.. అనేక గొంతులను మిమిక్రీ చేయడమే ఈ పక్షి స్పెషల్. .ఎక్కడంటే..!

Superb Lyrebird: భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయి. మనిషిలోని సృజనాత్మకతకు ప్రతిరూపం ఈ కళలు. వీటిలో బతక నేర్చడానికి నేర్చినవి.. ఎదుటివారిని నిలువునా ముంచేవి..

Superb Lyrebird: కోడి, నెమలి కలయిక ఈ పక్షి.. అనేక గొంతులను మిమిక్రీ చేయడమే ఈ పక్షి స్పెషల్. .ఎక్కడంటే..!
Lyrebird In Australia
Follow us

|

Updated on: Apr 15, 2021 | 4:43 PM

Superb Lyrebird: భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయి. మనిషిలోని సృజనాత్మకతకు ప్రతిరూపం ఈ కళలు. వీటిలో బతక నేర్చడానికి నేర్చినవి.. ఎదుటివారిని నిలువునా ముంచేవి, కీర్తి ప్రతిష్టలు పెంచేవి ఇలా ఎన్నో రకాలున్నాయి. సంగీతం, నాట్యం, వంటకాలు, గీతం, ఇలా మొత్తం 64 కళలున్నాయి. ఈ కళల్లో ఒకటి మిమిక్రీ. మనిషి ఎదుటువారిని అనుసరించడంతో పాటు, జంతువుల, పక్షుల అరుపులను కూడా అనుకరిస్తాడు.. తన గొంతుతో చేసే మాయాజాలం మిమిక్రీ తో అందరికీ అలరిస్తాడు. అయితే మనిషిలానే ఓ పక్షి కూడా మిమిక్రీ చేస్తుంది. అదేమిటి పక్షి మిమిక్రీ చేయడం . ఇది నమ్మే విషయమేనా అనుకుంటున్నారా.. ! కాదు నిజంగా ఓ పక్షి మిమిక్రీ చేస్తూ. రకరకాలుగా గొంతును మారుస్తుంది.. ఆ పక్షి ఆస్ట్రేలియాలో ఉంది.

లైర్ బర్ద్ గా పిలిచే ఈ పక్షులు ఆస్ట్రేలియాలో ఉంటాయి. నెమలి, కోడి కాంబినేషన్ లో లైర్ బర్ద్ పక్షులు కనిపిస్తూ.. ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి. అయితే ఈ పక్షి అరుపులు కాస్త వింతగా ఉంటాయి. చిన్నపిల్లలు అరుస్తున్నట్లుగా, చిన్న పిల్లలు ఏడుస్తున్నట్లుగా.. ఒకొక్కసారి కెమెరా ఫోటో తీసే సమయంలో క్లిక్ మనే శబ్దాలు, వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో వచ్చే సౌండ్స్ ఈ పక్షి గొంతు నుంచి వినిపిస్తాయి. ఇలా అనేక రకాల శబ్దాలను చేస్తుండడంతో ఈ పక్షులను మిమిక్రీ పక్షులు అని కూడా ముద్దుగా పిలుస్తారు. ఇలా రకరకాల శబ్దాలు రావడానికి కారణం గొంతులోని ఉండే కొన్ని ఎముకల కారణంగా ఇవి ఇలాంటి అసాధారణ శబ్దాలు చేస్తుంటాయని పరిశోధకులు తెలిపారు.

Also Read: Also Read: వెండితెర ‘సారంగదారియా’ సాంగ్ కు బుల్లి తెర నటీమణులు ఓ రేంజ్ లో డ్యాన్స్..

ఓవైపు కరోనా విజృంభన.. మరోవైపు పసిడి, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు.. ఎంతమేర పెరిగాయంటే