‘పుష్ప’ నుంచి తప్పుకున్న సేతుపతి.!

'పుష్ప' నుంచి తప్పుకున్న సేతుపతి.!

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి… వైవిధ్యమైన పాత్రలకు ఈ తమిళ హీరో పెట్టింది పేరు. తెలుగులో కూడా చిరంజీవి సినిమా ‘సైరా’తో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాలో కీలక పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారు. అంతేకాక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సేతుపతిని తీసుకున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే […]

Ravi Kiran

|

Apr 13, 2020 | 8:04 PM

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి… వైవిధ్యమైన పాత్రలకు ఈ తమిళ హీరో పెట్టింది పేరు. తెలుగులో కూడా చిరంజీవి సినిమా ‘సైరా’తో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాలో కీలక పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారు. అంతేకాక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సేతుపతిని తీసుకున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే విడుదలైన పోస్టర్లు బన్నీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. డేట్లు సర్దుబాటు కాకపోవడమే దీనికి కారణం అని ఫిల్మ్‌నగర్‌ టాక్. ఇప్పుడు ఆయన స్థానంలో అరవింద్ స్వామి, బాబీ సింహ, సునీల్ శెట్టి పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu