షాకింగ్.. ఆరు వేల తబ్లీఘీల జాడ లేదట.. కలకలం రేపుతోన్న బీజేపీ నేత ట్వీట్..!

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మర్కజ్ సమావేశాల వ్యవహారం గురించి తెలిసిందే. మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ సమావేశానికి వచ్చిన పలువురు విదేశీలకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియడంతో.. యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఈ తబ్లీఘీ సమావేశాలకు హాజరైన వారిని గుర్తించి వారందరికీ కరోనా టెస్టులు చేస్తూ.. పాజిటివ్ ఉన్న వారికి చికిత్స అందిస్తూ.. పలువురిని క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ఇంకా కొంతమంది తబ్లీఘీల జాడ లేదంటూ […]

షాకింగ్.. ఆరు వేల తబ్లీఘీల జాడ లేదట.. కలకలం రేపుతోన్న బీజేపీ నేత ట్వీట్..!
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 8:13 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మర్కజ్ సమావేశాల వ్యవహారం గురించి తెలిసిందే. మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ సమావేశానికి వచ్చిన పలువురు విదేశీలకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియడంతో.. యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఈ తబ్లీఘీ సమావేశాలకు హాజరైన వారిని గుర్తించి వారందరికీ కరోనా టెస్టులు చేస్తూ.. పాజిటివ్ ఉన్న వారికి చికిత్స అందిస్తూ.. పలువురిని క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ఇంకా కొంతమంది తబ్లీఘీల జాడ లేదంటూ బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్‌ చేశారు. సమావేశానికి హాజరైన వారిలో ఆరువేల మందిని ఇంకా గుర్తించలేదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. వారిలో కొందరు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వారు ముందుకు రావడంలేదంటూ పోస్ట్ చేశారు. వారి ఫోన్లు కూడా స్విచ్ఛా ఆఫ్‌ ఉన్నాయని.. అసలు వారి ఉద్దేశమేందో అర్థం కావడం లేదంటూ కపిల్ మిశ్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.