ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..?

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మార్చి 29 మొదలు కావాల్సిన ఈ లీగ్.. కరోనా ప్రభావంతో ఏప్రిల్ 15కు పోస్ట్‌పోన్‌ అయింది. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఐపీఎల్‌ను ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా వేయాలన్న నిర్ణయానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై రేపటిలోగా అధికారిక ప్రకటన రానుంది. ఫ్రాంచైజీలతో చర్చించిన ఐపీఎల్ గవర్నింగ్ […]

ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..?
Follow us

|

Updated on: Apr 13, 2020 | 7:58 PM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మార్చి 29 మొదలు కావాల్సిన ఈ లీగ్.. కరోనా ప్రభావంతో ఏప్రిల్ 15కు పోస్ట్‌పోన్‌ అయింది. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఐపీఎల్‌ను ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా వేయాలన్న నిర్ణయానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వచ్చినట్లు తెలుస్తోంది.

దీనిపై రేపటిలోగా అధికారిక ప్రకటన రానుంది. ఫ్రాంచైజీలతో చర్చించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని యోచిస్తోందట. అది కూడా సెప్టెంబర్, అక్టోబర్‌ల మధ్య ఈ టోర్నీ పెట్టాలని అనుకుంటున్నారు. కాగా, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఈ నెల 30 వరకు కొనసాగనుంది.

ఇవి చదవండి:

అక్తర్‌కు అఫ్రిదీ వత్తాసు.. మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..

ఆ కంపెనీలకు కరోనా లాక్‌డౌన్‌తో కాసుల వర్షం.. ఏవో తెలుసా.!