సెప్టెంబర్‌లో అన్ని ప్రవేశ పరీక్షలు.. ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు.!
ఎడ్ సెట్ తప్ప మిగతా అన్ని ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 9, 10, 11, 14వ తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షను రోజుకు రెండు విడతల చొప్పున

Telangana Entrance Exams: ఎడ్ సెట్ తప్ప మిగతా అన్ని ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 9, 10, 11, 14వ తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షను రోజుకు రెండు విడతల చొప్పున నిర్వహించనుండగా.. అగ్రికల్చర్ విభాగం పరీక్షను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. త్వరలోనే అధికారికంగా తేదీలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
అటు కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్ధులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వీళ్లందరికీ చివరి రోజు ఎంసెట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించనున్నారు. విద్యార్ధుల సంఖ్యను బట్టి చివరి రోజు ఒకటి లేదా రెండు ప్రత్యేక కేంద్రాలను అధికారులు కేటాయించనున్నారు.
Also Read:
Breaking: మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..




