దేశవ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సీన్ ఇవ్వాల్సిందే, అరవింద్ కేజ్రీవాల్

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచిత వ్యాక్సీన్ ఇవ్వాల్సిందే అన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ! ప్రతివారూ కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. మీరు కూడా ఢిల్లీ వాసులకు ఫ్రీగా ఇది ఇస్తారా అని ప్రశ్నించగా.. అసలిది ఎప్పుడు వస్తుందో, ఎలా ఉంటుందో, దీని ధర ఎంత అన్నవి తేలాల్సివుందని ఆయన చెప్పారు.వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చాక ‘నేషనల్ కోవిడ్ 19 ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. కేంద్రం నేరుగా దీనిని […]

దేశవ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సీన్ ఇవ్వాల్సిందే, అరవింద్ కేజ్రీవాల్
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Oct 24, 2020 | 6:59 PM

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచిత వ్యాక్సీన్ ఇవ్వాల్సిందే అన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ! ప్రతివారూ కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. మీరు కూడా ఢిల్లీ వాసులకు ఫ్రీగా ఇది ఇస్తారా అని ప్రశ్నించగా.. అసలిది ఎప్పుడు వస్తుందో, ఎలా ఉంటుందో, దీని ధర ఎంత అన్నవి తేలాల్సివుందని ఆయన చెప్పారు.వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చాక ‘నేషనల్ కోవిడ్ 19 ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. కేంద్రం నేరుగా దీనిని ప్రయారిటీ గ్రూపులకు లభింపజేస్తుందని భావిస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాలు, జిల్లాల  వారీ నెట్ వర్క్ ల ద్వారా ఇది ఉచితంగా రావచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా తాము ఫ్రీ వ్యాక్సీన్ ఇస్తామని ప్రకటించిన విషయం గమనార్హం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu