నిబంధనలు అతిక్రమిస్తే అంత తక్కువ జరిమానానా..? అమెజాన్ పై కఠిన చర్యలు తీసుకోండి… కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్

నిబంధనలు అతిక్రమిస్తే అంత తక్కువ జరిమానానా..? అమెజాన్ పై కఠిన చర్యలు తీసుకోండి అంటూ కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

నిబంధనలు అతిక్రమిస్తే అంత తక్కువ జరిమానానా..? అమెజాన్ పై కఠిన చర్యలు తీసుకోండి... కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్
Follow us

|

Updated on: Nov 27, 2020 | 6:23 PM

నిబంధనలు అతిక్రమిస్తే అంత తక్కువ జరిమానానా..? అమెజాన్ పై కఠిన చర్యలు తీసుకోండి అంటూ కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే ఇందుకు బలమైన కారణమే ఉంది. అది ఏంటంటే… ఈ- కామర్స్‌లో అమ్ముతున్న వస్తువులను సంబంధించి కేంద్రం ఓ నిబంధన విధించింది. వారు అమ్మే వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో స్పష్టం చేయాలనేది ఆ నిబంధన. కానీ అమెజాన్ సంస్థ ప్రభుత్వం విధించిన రూల్‌ని ఉల్లంఘించింది. వస్తువులను ఎక్కడ తయారు చేశారన్న వివరాలను పేర్కొనలేదు.

నిబంధనలు అతిక్రమిస్తే….

ఈ క్రమంలోనే ఇటీవల అమెజాన్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం రూ.25వేల జరిమానాను విధించింది. ఐతే ఈ జరిమానాను ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తీవ్రంగా తప్పుబట్టింది. భారత ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే.. అంత తక్కువ జరిమానానా అని ప్రశ్నించింది. ఈకామర్స్‌ దిగ్గజ సంస్థకు రూ.25వేలు పెద్ద లెక్కా..? అని మండిపడుతోంది. నిబంధనలను ఉల్లంఘించిన అమెజాన్‌ సంస్థపై… మరోసారి తప్పుచేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కనీసం ఏడు రోజుల పాటు అమెజాన్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది.

ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బీ.సీ. భార్టియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేవాలా ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అమెజాన్ వలన మన దేశ ఆర్థికవ్యవస్థ కలిగిన నష్టానికి సమానంగా జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. వస్తువుల తయారీ వివరాలను పేర్కొనకుండా.. తప్పుచేసిన ఈ కామర్స్ సంస్థలపై ఏడు రోజులు నిషేధం విధించాలన్నారు. మరోసారి తప్పు చేస్తే 15 రోజులు బ్యాన్ విధించాలని తెలిపారు. అప్పుడే విదేశీ కంపెనీలు భారత చట్టాలను గౌరవిస్తాయని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా ప్రధాని మోదీ వోకల్ ఫర్ లోకల్ నినాదం చేశారు. స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరగాలంటే ఈ-కామర్స్ సంస్థలు ఈ నిబంధలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని డిమాండ్ చేశారు.

బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?