ఏపీలో జల విలయం.. తీరం దాటినా తగ్గని ‘నివర్’ వేగం.. భారీ ఈదురుగాలులకు తోడు కుండపోత వాన..
నివర్ తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలను కుండపోతవానలు ముంచెత్తుతున్నాయి.

తీరం దాటినా నివర్ వేగం తగ్గలేదు. అదే కసితో దాడి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా మూడు రాష్ట్రాలను ఊపిరాడకుండా చేస్తోంది. అందులోనూ ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నివర్ తుఫాన్ ఏపీలో షివరింగ్ తెప్పిస్తోంది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఊహించనంతగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
