AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ ధరకే క్యాబ్ సేవలు.. మోటారు వాహన చట్ట పరిధిలోకి క్యాబ్ సేవలు వచ్చేలా సవరణ చేసిన కేంద్రం….

క్యాబ్‌ సేవల సంస్థలను నియంత్రించేలా, వాటిని నియంత్రించేందుకు మోటారు వాహనాల (సవరణ) పరిధిలోకి క్యాబ్ సేవలను తీసుకొస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

తక్కువ ధరకే క్యాబ్ సేవలు.. మోటారు వాహన చట్ట పరిధిలోకి క్యాబ్ సేవలు వచ్చేలా సవరణ చేసిన కేంద్రం....
Umakanth Rao
|

Updated on: Nov 27, 2020 | 9:12 PM

Share

క్యాబ్‌ సేవల సంస్థలను నియంత్రించేలా, వాటిని నియంత్రించేందుకు మోటారు వాహనాల (సవరణ) పరిధిలోకి క్యాబ్ సేవలను తీసుకొస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. కాలుష్య నియంత్రణ, వారి వ్యాపారంలో పారదర్శకత, తదితర ప్రయోజనాల కోసం రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలను నవంబర్ 27న విడుదల చేసింది. దీంతో క్యాబ్‌ సేవలు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి.

26 పేజీల గైడ్ లైన్స్…

తాజాగా కేంద్రం జారీ చేసిన మోటారు వాహనాల చట్టానికి సంబంధించి గైడ్ లైన్స్ ను 26 పేజీల నిబంధనలు రూపొందించింది. ప్రభుత్వం ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లు బాదేస్తున్న సర్జ్‌చార్జీలకు కేంద్రం చెక్‌ చెప్పింది. అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో 1.5 రెట్లు బేస్ ఛార్జీలకు కోత పెట్టింది. అలాగే అవి అందించే డిస్కౌంట్‌ను బేస్ ఛార్జీలలో 50 శాతానికి పరిమితం చేసింది.

కీలక సవరణలు ఇవే…

1. రాష్ట్రాల్లో బేస్ ఛార్జీ రూ .25/30గా ఉండాలి. అయితే బేస్ ఛార్జీలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. 2. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న డ్రైవర్లను ఆదుకునేలా ప్రతీ రైడ్‌ ద్వారా సంపాదించిన ఆదాయంలో కనీసం 80 శాతం వారికి అందాలని ప్రభుత్వం ఆదేశించింది. డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందించాలి. రూ .10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. 3. డ్రైవర్లు కూడా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఏ డ్రైవర్ కూడా12 గంటలకు మించి పనిచేయడానికి లేదు. తర్వాత 10 గంటల విరామం తప్పనిసరి. 4. షేర్డ్ మొబిలిటీ సంస్థల సేవలను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని నివారించడం కోసం సవరణపై కేంద్రం దృష్టి సారించింది.

సవరణ వెనుక ఉద్దేశం ఇదే…

కేంద్రం సవరించిన సెక్షన్ 93 మార్గదర్శకాల ప్రకారం క్యాబ్‌ సంస్థలు తమసేవలను, కార్యకలాపాలను ప్రారంభించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. క్యాబ్ సేవల నియంత్రణకోసం కేంద్రం పేర్కొన్న నిబంధనలను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశిస్తుంది. క్యాబ్‌సేవల సంస్థల నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. తద్వారా అగ్రిగేటర్లు జవాబుదారీగా ఉండటంతో పాటు, వారి కార్యకలాపాలకు బాధ్యత వహించేలా నిర్ధారించుకోవాలి. ఉపాధి కల్పన, సౌకర్యవంతమైన, సరసమైన ధరల్లో ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించే లక్ష్యంతో క్యాబ్‌ సేవల సంస్థల బిజినెస్‌ సాగాలి. ప్రజా రవాణ వ్యవస్థను గరిష్టంగా వినియోగించడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, వాహనాల ఉద్గార కాలుష్యాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది.

తద్వారా మానవ ఆరోగ్యానికి హాని తగ్గించడం అనే లక్ష్యాన్ని సాధించాలనేది ప్రభుత్వ వ్యూహం. దీంతోపాటు తాజా సవరణ ప్రకారం వాహన యజమాని (అతడు / ఆమె) మరణించిన సందర్భంలో, తమ వాహనాన్ని నమోదు లేదా బదిలీ చేసే వ్యక్తిని నామినేట్ చేయవచ్చని మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ తెలిపింది.