Ala Vaikuntapuramlo: బాలీవుడ్‌లో ‘వైకుంఠపురం’ రీమేక్.. హీరో ఎవరంటే..?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కి బ్లాక్‌బస్టర్ వసూళ్లు సాధించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం...
Ala Vaikuntapuramlo: ఈ మధ్యకాలంలో తెలుగు కథలు బాలీవుడ్‌లో తెరకెక్కడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను సైతం అందుకుంటున్నాయి. రీసెంట్‌గా ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’గా రూపొందించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలనాలను సృష్టించారు. అలాగే లేటెస్ట్‌గా ‘జెర్సీ’ మూవీని కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అటు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘కాంచన 3’ సినిమాను కూడా బాలీవుడ్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Vijay Sethupathi Counter Attack Over IT Raids On Thalapathy Vijay
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కి బ్లాక్‌బస్టర్ వసూళ్లు సాధించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే హిందీ రీమేక్‌ను ఎవరు దర్శకత్వం వహిస్తారు.? హీరో ఎవరు.? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం అరవింద్ జెర్సీ హిందీ రీమేక్‌ను దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్న విషయం విదితమే.
Also Read: Ismart Heroine Nidhi Agarwal In PSPK 27