AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ఫస్ట్‌లుక్‌లకు డేట్లు ఫిక్స్ చేసిన జక్కన్న..?

RRR movie update: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ మూవీలో మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది జనవరికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. చెర్రీ, ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలకు సంబంధించి జక్కన్న రెండు డేట్లను ఫిక్స్ చేసుకున్నారట. అవేంటంటే మార్చి […]

RRR: ఫస్ట్‌లుక్‌లకు డేట్లు ఫిక్స్ చేసిన జక్కన్న..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:52 PM

Share

RRR movie update: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ మూవీలో మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది జనవరికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. చెర్రీ, ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలకు సంబంధించి జక్కన్న రెండు డేట్లను ఫిక్స్ చేసుకున్నారట.

అవేంటంటే మార్చి 27, మే 20. మార్చి 27న చెర్రీ, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజులు ఉండగా.. ఆ రోజుల్లో ఆయా హీరోలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నారట. కాగా ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపిస్తుండగా.. వారి లుక్‌ల కోసం అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ విషయంలో ఫ్యాన్స్‌ను ఇప్పటికే చాలా ఊరిస్తూ వస్తోన్న రాజమౌళి.. ఈసారి మాత్రం హీరోల బర్త్‌డేలకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

అయితే భారీ బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్‌’ను డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మారిస్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీపై తెలుగులో పాటు మిగిలిన భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.