Telangana BJP: ఒకరా? లేక ఇద్దరా?.. బీజేపీలో కొత్త ప్రయోగం
BJP to take up experiment in Telangana: తెలంగాణ బీజేపీ సారథ్య బాధ్యతలు అప్పగించడంలో అధినాయకత్వం కొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌ని మార్చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. దాంతో స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరికి ఇస్తారన్నదానిపై ఊహాగానాలు చెలరేగాయి. డికెఅరుణ లాంటి వారికి అధ్యక్ష బాధ్యతలిస్తారని కూడా కథనాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కొత్త ప్రయోగం చేసేందుకు పార్టీ అధినాయకత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు […]
BJP to take up experiment in Telangana: తెలంగాణ బీజేపీ సారథ్య బాధ్యతలు అప్పగించడంలో అధినాయకత్వం కొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌ని మార్చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. దాంతో స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరికి ఇస్తారన్నదానిపై ఊహాగానాలు చెలరేగాయి. డికెఅరుణ లాంటి వారికి అధ్యక్ష బాధ్యతలిస్తారని కూడా కథనాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కొత్త ప్రయోగం చేసేందుకు పార్టీ అధినాయకత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
నిన్నటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి లక్ష్మణ్ మార్పు ఖాయమని ప్రచారం జరిగింది. కొత్త కృష్ణుడు వస్తారని ఆ పార్టీలో గుసగుసలు విన్పించాయి. అయితే ఇప్పుడు కొత్త టాక్ విన్పిస్తోంది. కొత్త నేతలు పార్టీని హ్యాండిల్ చేయలేరని భావించిన అధిష్టానం… ప్రస్తుతం కొత్త ప్రయోగానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి సస్పెన్స్ కు తెరపడింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర పార్టీలో తీవ్ర స్థాయిలో అధ్యక్షుడి మార్పుపై చర్చ జరుగుతూ వస్తోంది. ఇప్పటికే లక్ష్మణ్ పదవీ కాలం ముగిసినా గత ఏడాది కాలంగా ఆయననే కొనసాగిస్తూ వస్తోంది జాతీయ నాయకత్వం. రాష్ట్రంలో గత ఏడాదిగా జరుగుతున్న ఎన్నికల్లో ఒడిదుడుకులు ఎదురైనా ఓవరాల్ పర్ఫార్మెన్స్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో పార్టీ పెద్దలు ఆయననే కొనసాగించాలని అనుకుంటోంది. దాంతో పాటు ఇంకో ప్రయోగానికి పార్టీ రెడీ అవుతోంది.
ఇప్పటికిప్పుడు అధ్యక్షుడి మార్పుతో ఒరిగేదేమి లేదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. అధ్యక్షుడిని మార్చడం ద్వారా అనవసర వివాదాలు సృష్టించుకోవడం ఎందుకన్న అభిప్రాయానికి అధినాయకత్వం వచ్చింది. మరో రెండున్నరేళ్ళ పాటు ఆయననే కొనసాగించి .. ఆ తరువాత అవసరమైతే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించింది.
పార్టీలో కొత్తగా చేరిన వారు సైతం అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకున్న వారు సైతం తమకు అధ్యక్ష పదవి కేటాయించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికిప్పుడు పార్టీ అధ్యక్షుడిని కొత్తవారికి ఇస్తే పార్టీలో గందరగోళం నెలకొనే అవకాశం ఉన్నట్లు అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ను కొనసాగించేందుకు జాతీయ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల పేర్లు ఒకే అయిన తర్వాత…కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఈ నెలాఖరున లక్ష్మణ్ పేరును ప్రకటించబోతున్నారని సమాచారం. మొత్తానికి లక్ష్మణ్ మరో రెండేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. అయితే కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించే దిశగా అడుగులు పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో చేసిన ప్రయోగం సక్సెస్ అవడంతో దాన్ని తెలంగాణలోను అమలు పరచనున్నట్లు తెలుస్తోంది. డికె అరుణ లాంటి చరిష్మా వున్న వారిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పెట్టి.. ఒకవైపు ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు చేస్తూనే.. సంస్థాగత బాధ్యతల్లో లక్ష్మణ్‌ని కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది.
జాతీయ స్థాయిలో అమిత్‌షాను కొనసాగిస్తూనే జెపీ నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. కొంత కాలం తర్వాత జేపీ నడ్డాను పూర్తిస్థాయి ప్రెసిడెంట్‌ని చేశారు. అదే విధంగా లక్ష్మణ్‌ని కొనసాగిస్తూనే డికె అరుణను వర్కింగ్ ప్రెసిడెంట్‌ని చేస్తారని.. వచ్చే ఎన్నికల నాటికి ఆమె తన సారథ్య బాధ్యతలను నిర్వర్తించడంలో సక్సెస్ అయితే ఆమెనే పూర్తి స్థాయి ప్రెసిడెంట్‌ని చేస్తారని చెప్పుకుంటున్నారు. ఈ నెలాఖరుకు క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: Supreme Court rejects Vinay Sharma petition