ఓటీటీలో ‘లక్ష్మీబాంబ్’ విడుదల.. రిలీజ్ డేట్ ఖరారు.!

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అన్ లాక్ 1 నేపధ్యంలో షూటింగులకు కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చినా.. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున థియేటర్లు ఇప్పట్లో తెరిచేది లేదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. ఈ క్రమంలోనే చాలామంది నిర్మాతలు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తున్న […]

  • Ravi Kiran
  • Publish Date - 9:12 pm, Tue, 16 June 20
ఓటీటీలో 'లక్ష్మీబాంబ్' విడుదల.. రిలీజ్ డేట్ ఖరారు.!

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అన్ లాక్ 1 నేపధ్యంలో షూటింగులకు కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చినా.. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున థియేటర్లు ఇప్పట్లో తెరిచేది లేదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి.

ఈ క్రమంలోనే చాలామంది నిర్మాతలు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీ బాంబ్’ త్వరలోనే ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ. 125 కోట్లతో దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగష్టు 15న ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.