అంగరంగ వైభవంగా ఆకాశ్‌-శ్లోకాల వివాహం

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌-శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ సెంటర్ ఈ వేడుకకు వేదికైంది. చిన్ననాటి స్నేహితులైన ఆకాశ్‌-శ్లోకాలు ప్రముఖుల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు.ఈ వేడుకకు రాజకీయ సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు ఆమిర్‌ ఖాన్-కిరణ్‌ రావు దంపతులు, జుహీ చావ్లా, ఐశ్వర్య రాయ్‌ కుటుంబం, కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, రజినీకాంత్‌, సౌందర్య-విశాఖన్‌ దంపతులు, రణ్‌బీర్‌ […]

అంగరంగ వైభవంగా ఆకాశ్‌-శ్లోకాల వివాహం
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:17 PM

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌-శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ సెంటర్ ఈ వేడుకకు వేదికైంది. చిన్ననాటి స్నేహితులైన ఆకాశ్‌-శ్లోకాలు ప్రముఖుల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు.ఈ వేడుకకు రాజకీయ సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.

బాలీవుడ్ ప్రముఖులు ఆమిర్‌ ఖాన్-కిరణ్‌ రావు దంపతులు, జుహీ చావ్లా, ఐశ్వర్య రాయ్‌ కుటుంబం, కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, రజినీకాంత్‌, సౌందర్య-విశాఖన్‌ దంపతులు, రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, అయాన్‌ ముఖర్జీ, షారుక్ ఖాన్‌-గౌరీ దంపతులు, టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందుల్కర్‌ -అంజలి, జహీర్‌ ఖాన్‌-సాగరిక, యువరాజ్‌ సింగ్‌, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌-కేరీ దంపతులు, ఐరాస మాజీ జనరల్‌ సెక్రటరీ బాన్‌ కీ మూన్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌-అంజలీ పిచాయ్‌ దంపతులు, వ్యాపార వేత్త లక్ష్మి మిత్తల్‌ తదితరులు వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అతిథులు తరలి వచ్చారు. మూడు రోజుల పాటు వివాహ వేడుకలు కొనసాగనున్నాయి. వివాహ వేదిక వద్దకు ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని అంబానీ కుటుంబం ముందే అతిథులను కోరింది.

తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ