పిల్లలను ఉగ్రవాద బాట పట్టనివ్వకండంటూ తల్లిదండ్రులకు ఆర్మీ వినతి

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌కు చెందిన మాతృమూర్తులంతా తమ పిల్లలు ఉగ్రవాదం దిశగా వెళ్లకుండా చూడాలని ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్‌సింగ్ ధిల్లాన్ కోరారు. ఒకవేళ ఎవరైనా ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకుని, తిరిగి పశ్చాత్తాపంతో వెనక్కి తిరిగివస్తే, వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చేసే బాధ్యతను ఆర్మీ తీసుకుంటుందని అన్నారు. శ్రీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా అన్నారు. కాగా 152 మంది కశ్మీరీ యువకులు ఇటీవల ఆర్మీలో చేరారు. అలాగే […]

పిల్లలను ఉగ్రవాద బాట పట్టనివ్వకండంటూ తల్లిదండ్రులకు ఆర్మీ వినతి
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:05 PM

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌కు చెందిన మాతృమూర్తులంతా తమ పిల్లలు ఉగ్రవాదం దిశగా వెళ్లకుండా చూడాలని ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్‌సింగ్ ధిల్లాన్ కోరారు. ఒకవేళ ఎవరైనా ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకుని, తిరిగి పశ్చాత్తాపంతో వెనక్కి తిరిగివస్తే, వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చేసే బాధ్యతను ఆర్మీ తీసుకుంటుందని అన్నారు. శ్రీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా అన్నారు. కాగా 152 మంది కశ్మీరీ యువకులు ఇటీవల ఆర్మీలో చేరారు. అలాగే శనివారం ఉదయం చేపట్టిన ఆర్మీ సెలక్షన్ కొసం దాదాపు 2వేలమంది యువకులు పాల్గొన్నారు.