Ajwain Leaves Benefits: వాము ఆకులతో రక్త హీనతను దూరం చేసుకోవచ్చు.. ఇంకా ఎన్నో లాభాలు!
ఇప్పుడున్న వారిలో చాలా మందికి వాము ఆకులు అంటే ఏంటో తెలీదు. ఆరోగ్యానికి వాము ఎంత మంచిదో.. వాము ఆకులు అంతకంటే మంచివి. పూర్వం అయితే ప్రతి ఇంటి ముందు వాము ఆకుల చెట్లు ఉండేవి. ఈ వాము ఆకులతో బజ్జీలు, పలు రకాల వంటలు కూడా చేసేవారు. వాము ఆకులను నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. వాము ఆకుల్లో ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. ఈ ఆకులు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య..

ఇప్పుడున్న వారిలో చాలా మందికి వాము ఆకులు అంటే ఏంటో తెలీదు. ఆరోగ్యానికి వాము ఎంత మంచిదో.. వాము ఆకులు అంతకంటే మంచివి. పూర్వం అయితే ప్రతి ఇంటి ముందు వాము ఆకుల చెట్లు ఉండేవి. ఈ వాము ఆకులతో బజ్జీలు, పలు రకాల వంటలు కూడా చేసేవారు. వాము ఆకులను నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. వాము ఆకుల్లో ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. ఈ ఆకులు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. మరి ఇంత మంచి గుణాలు ఉన్న వాము ఆకులు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వాము ఆకులో పోషకాలు:
వాము ఆకుల్లో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్ వంటివి మెండుగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకుంటే.. అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు.
రక్త హీనత:
వాము ఆకుల్లో ఐరెన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్త హీనతతో బాధ పడే వారు వీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి దూరం అవ్వొచ్చు. నేరుగా తినడానికి ఇబ్బంది పడేవారు సలాడ్స్ లేదా జ్యూస్ లా అయినా తీసుకోవచ్చు.
నెలసరి సమయంలో నొప్పి మాయం:
పీరియడ్స్ సమయంలో నొప్పితో ఇబ్బంది పడే వారు.. వాము ఆకుల్ని తినడం వల్ల ఆ నొప్పి అనేది మాయం అవుతుంది. ఇలాంటి సమస్యల్ని తగ్గించడంలో వాము ఆకులు బాగా హెల్ప్ చేస్తాయి.
కఫం దూరం అవుతుంది:
శీతా కాలంలో చలి కారణంగా చాలా మందికి జలుబు, దగ్గు వంటివి ఎటాక్ చేస్తాయి. జలుబు కారణంగా కఫం ఎక్కువగా వస్తుంది. దీంతో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాంటి వారు వాము ఆకుల్ని నమిలి తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. అంతే కాకుండా ఏమైనా శ్వాస సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. దీంతో గొంతు, ఊపిరి తిత్తులు ఫ్రీ అవుతాయి.
నోటి దుర్వాసన దూరం:
వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి మెండుగా ఉంటాయి. ఈ ఆకుల్ని బాగా నమిలి తినడం వల్ల నోటిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియా అనేవి నశిస్తాయి. నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. కావిటీస్, నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.




