ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఉచిత ‘లైఫ్ ఇన్సూరెన్స్’!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.4 లక్షల విలువ చేసే ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ అందించనుంది. అయితే ఇందుకోసం వినియోగదారులు రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భార‌తీ ఎక్సా సంస్థలు ఆ పాల‌సీకి బాధ్యత వహిస్తాయి. వినియోగదారుల వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. వినియోగదారులు రూ.249 ప్లాన్‌తో రీచార్జి చేసుకున్న తర్వాత వారి మొబైల్ నెంబరుకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:06 pm, Sat, 11 May 19
ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఉచిత 'లైఫ్ ఇన్సూరెన్స్'!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.4 లక్షల విలువ చేసే ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ అందించనుంది. అయితే ఇందుకోసం వినియోగదారులు రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భార‌తీ ఎక్సా సంస్థలు ఆ పాల‌సీకి బాధ్యత వహిస్తాయి. వినియోగదారుల వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి.

వినియోగదారులు రూ.249 ప్లాన్‌తో రీచార్జి చేసుకున్న తర్వాత వారి మొబైల్ నెంబరుకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో ఇన్సూరెన్స్‌ పాలసీకి సంబంధించిన వివరాలు ఉంటాయి. పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా సమర్పించాలి అన్న విషయాలు అందులో ఉంటాయి. కస్టమర్లు ఆ వివరాలను నమోదు చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎయిర్‌టెల్ యాప్‌ నుంచి కస్టమర్లు పాలసీకి సంబంధించిన కాపీని పొందవచ్చు.