Hyderabad: న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి చిట్టా రెడీ.. లిస్ట్‌లో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు

హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై మళ్లీ కలకలం రేపుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సప్లై చేసిన ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు.

Hyderabad: న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి చిట్టా రెడీ.. లిస్ట్‌లో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు
Drugs
Follow us

|

Updated on: Jan 08, 2022 | 6:36 PM

హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై మళ్లీ కలకలం రేపుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సప్లై చేసిన ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. మూడు ముఠాలకు చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కీలక ఆధారాలు సేకరించారు. ముంబై కేంద్రంగా దేశ వ్యాప్తంగా డ్రగ్స్ ను టోనీ అండ్ గ్యాంగ్ సప్లె చేస్తున్నట్లు గుర్తించారు. వారి మొబైల్ డేటా ఆధారంగా చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులో వచ్చాయన్నారు. హైదరాబాద్ లోని 30 మంది ప్రముఖుల వ్యవహారం బయలైందన్నారు. డ్రగ్స్ కు బానిసై పదేపదే కొనుగోలు చేస్తున్న వారి జాబితాతో పాటు న్యూయర్ వేడుకల్లో డ్రగ్స్ కొనుగోలు చేసిన వందల మంది డేటాను సేకరించారు పోలీసులు.

న్యూయర్ వేడుకల్లో హైదరాబాద్ పై కన్నేసిన టోనీ గ్యాంగ్ పంజాగుట్టలోని ఓయో రూమ్స్ ను టార్గెట్ చేసుకున్నారు. ముంబై నుండి తెచ్చిన డ్రగ్స్ ను ఓయో రూమ్స్ కేంద్రంగా సరఫరా చేశారు. కీలక సమాచారం తెలుసుకున్న పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి.. టోనీ గ్యాంగ్ లోని ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు సేకరించిన చిట్టాలో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ వాడే వారి విషయంలో ఉపేక్షించబోమని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీపీ ఆనంద్.

18 నుండి 30 ఏళ్ళ లోపు యువతే ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాలేజీ, ఉద్యోగం పేరుతో డ్రగ్స్‌కు బానిసలైనట్లు పోలీసులు గుర్తించారు. వీరందరిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సలింగ్ చేయనున్నారు. తరుచుగా డ్రగ్స్‌ తీసుకునేవారినైతే జైలుకు పరిమితం చేస్తామంటున్నారు. అలాంటి వారిపై సెక్షన్ 25 కింద కేసులు నమోదు చేసి న్యాయస్దానం ముందు హాజరు పరుస్తామని చెప్పారు పోలీసులు.

Also Read: Viral: రోబోతో ప్రేమలో పడ్డ వ్యక్తి.. తానులేక, నేను లేనంటూ ప్రేమ గీతాలు.. త్వరలో పెళ్లి!

ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..