కాంగ్రెస్ ఎంపీపై దాడి.. విలువైన పత్రాలు చోరీ..!

ఢిల్లీ నడిబొడ్డున కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి నివాసం వద్ద సిబ్బందిపై దాడి చేసి, ఆఫీసులో చోరీకి తెగబడ్డారు దుండగులు. హుమాయున్‌రోడ్డులోని తిలక్‌మార్గ్‌ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఎంపీ అధికారిక గృహంలో

  • Tv9 Telugu
  • Publish Date - 9:29 pm, Tue, 3 March 20
కాంగ్రెస్ ఎంపీపై దాడి.. విలువైన పత్రాలు చోరీ..!

Adhir: ఢిల్లీ నడిబొడ్డున కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి నివాసం వద్ద సిబ్బందిపై దాడి చేసి, ఆఫీసులో చోరీకి తెగబడ్డారు దుండగులు. హుమాయున్‌రోడ్డులోని తిలక్‌మార్గ్‌ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఎంపీ అధికారిక గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీకి బాగా కావాల్సిన వాళ్లమంటూ ఇంట్లోకి ప్రవేశించి.. ఆ తర్వాత సిబ్బందిపై దాడి చేసి విలువైన పత్రాలు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు దగ్గరవాళ్లే ఇలా చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు తెలియాల్సి ఉంది. అదిర్‌ రంజన్‌ చౌదరి గతంలో పశ్చిమబెంగాల్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.

[svt-event date=”03/03/2020,9:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]