లక్ష్మీపార్వతిపై దివ్యవాణి తీవ్ర విమర్శలు

లక్ష్మీ పార్వతి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నటి, టీడీపీ మహిళా నేత దివ్య వాణి ఘాటు విమర్శలకు దిగారు. ఈ నెలాఖరున రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విడుదలను అడ్డుకోవడానికి టీడీపీ నేతల శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై టీడీపీ నేతలు, నటి దివ్యవాణి, దేవీబాబు, బ్రహ్మంచౌదరి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. […]

లక్ష్మీపార్వతిపై దివ్యవాణి తీవ్ర విమర్శలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 27, 2019 | 4:49 PM

లక్ష్మీ పార్వతి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నటి, టీడీపీ మహిళా నేత దివ్య వాణి ఘాటు విమర్శలకు దిగారు. ఈ నెలాఖరున రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విడుదలను అడ్డుకోవడానికి టీడీపీ నేతల శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై టీడీపీ నేతలు, నటి దివ్యవాణి, దేవీబాబు, బ్రహ్మంచౌదరి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈసీ కోరిన డాక్యుమెంట్లు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ జీవితంలో లక్ష్మీపార్వతి విషపుచుక్కని దివ్యవాణి తీవ్రస్థాయిలో విమర్శించారు.