బ్యాంక్‌లపై ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ విజయ్ మాల్యా..

పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు బ్యాంకులు కలిసికట్టుగా ముందుకు రావడంపై ప్రముఖ లిక్కర్ వ్యాపారి, ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యా స్పందించారు. తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో నాడు బ్యాంకులు ఇదేవిధంగా వ్యవహరించి ఉంటే..అది మూత పడేది కాదన్నారు. ఏడేళ్ల క్రితం భారత దేశంలోనే మంచి విమాన సంస్థ మూతపడడానికి కారణం బ్యాంకులేనని ఆరోపించారు. జెట్ ఎయిర్ వేస్ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కన్సార్షియం రూ.1500 కోట్ల నిధులను […]

బ్యాంక్‌లపై ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ విజయ్ మాల్యా..
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 26, 2019 | 7:52 PM

పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు బ్యాంకులు కలిసికట్టుగా ముందుకు రావడంపై ప్రముఖ లిక్కర్ వ్యాపారి, ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యా స్పందించారు. తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో నాడు బ్యాంకులు ఇదేవిధంగా వ్యవహరించి ఉంటే..అది మూత పడేది కాదన్నారు. ఏడేళ్ల క్రితం భారత దేశంలోనే మంచి విమాన సంస్థ మూతపడడానికి కారణం బ్యాంకులేనని ఆరోపించారు. జెట్ ఎయిర్ వేస్ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కన్సార్షియం రూ.1500 కోట్ల నిధులను సేకరించనుంది. అయితే పీఎస్‌యూ బ్యాంకుల తీరునూ, ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విజయ్ మాల్యా ట్వీట్టర్‌లో విమర్శించారు. “ప్రభుత్వరంగ బ్యాంకులు జెట్ ఎయిర్ వేస్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషం, ఈ తరహాలోనే కింగ్ ఫిషర్‌ను ఆదుకుంటే బాగుండేది”అని మొదటి ట్వీట్‌లో విజయ్‌మాల్యా పేర్కొన్నారు.

అలాగే “నా ఆస్తులన్నీ కూడా కర్ణాటక హై కోర్టు ముందు ఉన్నాయి. వీలైతే ప్రభుత్వ బ్యాంకులు నా ఆస్తులు అమ్మి.. జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడండి” అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

“నేను మొత్తం రూ.4000 కోట్లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది, కంపెనీని కాపాడేందుకు పెట్టుబడి పెట్టాను. దీన్ని గుర్తించకుండానే..ప్రభుత్వ బ్యాంకులు నన్ను విమర్శించాయి. కానీ జెట్ ఎయిర్ వేస్ విషయంలో మాత్రం ఇవే ప్రభుత్వ బ్యాంకులు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణికి ఇది ఒక ఉదాహరణ”అంటూ మరో ట్వీట్ చేశారు విజయ్ మాల్యా.

గతంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంస్థను ఆదుకోవాలని లేఖలు రాస్తే ఎన్డీఏ ప్రభుత్వం నానా హంగామా చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను ఆదుకోవడం నేరం అన్నట్లు చిత్రీకరించారు. మరి ఇప్పుడు జెట్ ఎయిర్‌వేస్‌ను ఎన్డీఏ ప్రభుత్వం, బ్యాంకులు ఏ ప్రాతిపదికన ఆదుకున్నాయి..ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చిన మార్పులేమిటో తెలియడం లేదంటూ మాల్యా ఘాటుగా విమర్శించారు.

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..